Home > తెలంగాణ > ‘మిరాబ్’ కవిత్వం సున్నితం.. ఖాజా అఫ్రిది పుస్తకంపై ఎడిటర్ శ్రీనివాస్

‘మిరాబ్’ కవిత్వం సున్నితం.. ఖాజా అఫ్రిది పుస్తకంపై ఎడిటర్ శ్రీనివాస్

‘మిరాబ్’ కవిత్వం సున్నితం.. ఖాజా అఫ్రిది పుస్తకంపై ఎడిటర్ శ్రీనివాస్
X

సీనియర్ పాత్రికేయుడు ఖజా అఫ్రిది రాసిన కవిత్వంలో సున్నితమైన మానవ సంబంధాలు ఉన్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె. శ్రీనివాస్ ప్రశసించారు. ఆఫ్రిది రచించిన ‘మిరాబ్’ కవితా సంపుటిని సోమవారం రవీంద్ర భారతిలో శ్రీనివాస్ ఆవిష్కరించారు.

‘‘ఇది తెలుగు కవిత్వానికి ఇన్సూరెన్స్ వంటిది. ఈ కవితల్లో ఆస్తిత్వ వేదన కనిపిస్తోంది. దీపంగూళ్లు ఉన్నాయోలేవో తెలియదు కానీ ఖాజా కవిత్వంలో ఆనవాళ్ల స్మరణ ఎక్కువగా ఉంది. పాత్రికేయ వృత్తికి కవిత్వ రచనకు వైరుధ్యం ఉంటుంది. కవులు సంఘటనలు వెతుక్కొని కవితలు రాస్తే జర్నలిస్టుల అనుభవం కవిత్వానికి మేలు చేస్తుంది. తల్లిదండ్రులపై కవిత్వం బాగా రాశారు. వదిలేసిన జీవిత బంధాన్ని, సున్నితమైన అంశాలను చూపారు’’ అని అన్నారు.

తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. అఫ్రిది తన అక్రందనలను కవితల్లోకి తర్జుమా చేశారని అన్నారు. కవి యాకుబ్ మాట్లాడుతూ.. మానవత్వమే ‘మిరాబ్’ సందేశమని అన్నారు. సారంగి ఫౌండేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో సినీ దర్శకులు వేణు ఉడుగుల, కవులు స్కైబాబా, మెర్సీ మార్గరెట్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Updated : 19 Sep 2023 1:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top